Thursday, 11 April 2024

సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత


ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. తీహార్‌ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో కవితను సీబీఐ ప్రశ్నించిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన జైలులో మరోసారి ప్రశ్నించింది. కవితను మరోసారి విచారించడానికి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద సీబీఐ అనుమతి తీసుకున్నది.

https://youtube.com/shorts/gyJ_iGsN3hs?si=82Cv-r4li_4b8VYy

సీబీఐ అరెస్ట్‌పై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు అత్యవసర విచారణ కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ స్పెషల్‌ కోర్టులో దరఖాస్తు చేశారు. ప్రత్యేక జడ్జి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు అప్లికేషన్‌ దాఖలు చేశారు. 





మంత్రి మాటల్లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు


అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  ఏం మాట్లాడినా కౌంటర్‌ ఇచ్చారు. అసలు రేవంత్‌ చెప్పేది కాంగ్రెస్‌ పార్టీలో నడువదు అన్నారు. అట్లా ఉప్పూ నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఫలితాల తర్వాత ఒక్కటయ్యారు. ఈ మధ్యకాలంలో బీజేపీ నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డి బీజేపీలోకి వస్తాననని తమ పార్టీ పెద్దలతో చెప్పినట్టు ఆరోపించారు. దీన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్‌ చేసినా రెండురోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి గేట్లు ఎక్కడివి? బిల్డింగ్‌ ఎక్కడిది? ఉన్న8 సీట్ల ఉన్న ఆపార్టీ ఎక్కడిది అని ఎదురు ప్రశ్నించారు. 


రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఏక్‌నాథ్‌ షిండే ఎవరు అన్న చర్చ జరుగుతున్నది. దీనిపై స్పందించి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... 'కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఎవరూ లేరు. పదేళ్లు రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి బీజేపీనే ఏక్‌నాథ్‌షిండేను సృష్టించిందన్నారు. హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలు నోరు అదుపులోపెట్టుకోవాలని మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా దేనికైనా సిద్ధమని' మంత్రి సవాల్‌ విసిరారు.


రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక అధిష్ఠాన నిర్ణయాన్నికోమటిరెడ్డి బ్రదర్స్‌  బహిరంగంగా వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో పని చేయను అన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్మే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా రేవంత్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డిల జరిగిన మధ్య మాటల యుద్ధం తెలిసిందే. ఆ సమయంలో వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాకుండా తన తమ్ముడి కోసం పనిచేయాలని కార్యకర్తలను, నేతలను కోరినట్టు ఆడియో ఒకటి కలకలం సృష్టించింది., అట్లా రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చారు. రేవంత్‌ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని అంటున్నారు. ఆయనే పదేళ్లు సీఎం అని కొనియాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక  వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో అంటున్నారు. 

Wednesday, 10 April 2024

కంటోన్మెంట్ ఫలితంపై ఆసక్తి


కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారైంది. నివేదిత ను అభ్యర్థిగా ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

స్థానిక నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.


మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ఈ స్థానం ఉన్నది. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితం పై ఆసక్తి నెలకొన్నది. గత ఎన్నికల్లో ప్రధాన పోటీబీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే జరిగింది. బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ ఎస్ అభ్యర్థిగా లాస్య సోదరి నివేదిత పేరు దాదాపు ఖారారు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ఆ పార్టీ ప్రకటించింది. కాషాయ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది.

కడియం కామెంట్స్‌.. బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు



బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. 


గతంలో ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. కాళేశ్వరం ఫీలర్ల కుంగుబాటుపై నిపుణుల సూచనల ప్రకారం మనం ముందుకు వెళ్లాలి. కానీ కేసీఆర్‌ తాను కుర్చీ వేసుకుని మూడు నెలల్లో బాగు చేస్తానని అనడాన్ని తప్పుపట్టారు. 


ఇలాంటివే పార్టీకి నష్టం చేశాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నిర్మాణం లేకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని తాను సూచించానని కానీ దాన్ని కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.


నియోజకవర్గంలో గతంలో మంత్రిగా తాను చేసిన పనులే తప్పా గత పదేళ్ల కాలంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పెద్దగా అభివృద్ధి జరగలేదు అన్నారు. 


బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం పార్టీకి నష్టం చేసిందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఓటర్ల దగ్గరి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. 


కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగింది ఇది కూడా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోవడానికి కారణం అన్నారు. 


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్న తానే ఆ పార్టీ చేరడానికి కారణాలు చెబుతూ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనారిటీలపై విపరీతంగా దాడులు పెరిగాయని.. దాన్ని అడ్డుకునే శక్తి ప్రాంతీయపార్టీలకు లేదన్నారు. అందుకే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 


అట్లనే మోడీ ప్రభుత్వం ప్రాంతీయపార్టీలను టార్గెట్‌ చేసిందని, దీంతో ప్రాంతీయపార్టీల మనుగడను ప్రశ్నార్థం చేసిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తే పార్టీ మనుగడ కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


అయితే కేసీఆర్‌ ఫైటర్‌ అని ఆయన ప్రజా సమస్యలపై పోరు చేస్తూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తే పార్టీకి తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.

టెట్‌: నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్‌ అవకాశం


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. 

దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి (ఎడిట్‌ ఆప్షన్‌) ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. 

మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి.

ఈసారి ఫీజులు భారీగా ఉండటంతో దరఖాస్తులు తగ్గాయి. 

వచ్చే నెల 20 వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...