Thursday, 23 May 2024

రోడ్డుపై గుంతలు.. మహిళ వినూత్న నిరసన


-హైదరాబాద్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే రోడ్డుపై ఓ మహిళ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోని నీటిలో కూర్చుని ఆందోళనకు దిగారు. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో... అటుగా వెళ్తుంటే ప్రమాదానికి గురవుతున్నామని ఆమె వ్యక్తం చేశారు. 

-ఇదే రోడ్డుపై వెళ్తూ తమ పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని వాపోయారు. ఉప్పల్‌ నుంచి నాగోల్‌కు వచ్చేలోపు లెక్కించగా 30 గుంతలు ఉన్నట్టు చెప్పారు. ప్రజలు చెల్లించిన పన్నులు ఏం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీని ఆమె ప్రశ్నించారు. 

-అనంతరం నాగోల్‌ కార్పొరేట్‌, స్థానిక నేతలు జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడటంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఢిల్లీలో ఎన్డీఏ, ఇండియా ఢీ అంటే ఢీ


- దేశ రాజధాని ఢిల్లీ ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కట్టే ప్రజలు లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరోపార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2019లో ఇక్కడి 7 స్థానాలను కైవసం చేసుకున్న కాషాయపార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి (ఆప్‌) పట్టం కట్టారు. 


- సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ ఏపీ దాడి వంటి ఘటనలు ఆప్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఆర విడుతలో ఢిల్లీలోని 7 నియోజకవర్గాకలు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది. 


- గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన అభ్యర్థులనూ బీజేపీ మార్చి మొత్తం 7 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇక్కడ ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా, ఎన్టీఏ కూటముల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉన్నది. 


- అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్‌, తాగునీరు వంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చే హస్తిన ఓటర్లు లోక్‌సభకు వచ్చేసరికి జాతీయ భద్రత, అభివృద్ధి, ప్రధాని మోడీ సమర్థత వంటి చూస్తున్నారు. ఈసారి ఓటర్లు మద్దతు పలుకుతారంటే మౌనమే సమాధానం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఢిల్లీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే ఉత్కంఠ నెలకొన్నది.

'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' నిజం కాబోతున్నది: శివరాజ్‌సింగ్‌


ఎన్డీఏకు 'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, విదిశ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Saturday, 18 May 2024

సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం


కొవిడ్‌ ఉధృతి చాలా తగ్గిందని అంతా అనుకుంటున్న సమయంలో అది అక్కడక్కడా పంజా విసురుతూనే ఉన్నది. తాజాగా సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం సృష్టిస్తున్నది.  ఈ నెల 5 నుంచి 11 వ తేదీ మధ్య వారం వ్యవధిలో 25,900 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం అంతకు ముందు వారం కన్నా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి.  దీంతో సింపూర్‌ ప్రభుత్వం హెల్త్  అడ్వైజరీ జారీ చేసింది.  మాస్క్‌ ధరించడం సహా ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది. 



బాల్యాన్ని గుర్తు చేసుకుని రాహుల్‌ భావోద్వేగం

 


'రాయ్‌బరేలీ వెళ్లినప్పుడల్లా నేను, ప్రియాంక మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. నాన్నమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తున్నది. చిన్నప్పటి నుంచి రాజకీయాలతో అనుబంధం ఉన్నది. కానీ, మా మధ్య రాజకీయాలకు ఎప్పుడూ చోటివ్వలేదు' అని బాల్యాన్ని గుర్తు చేసుకున్న రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యారు'

మీరు రాజకీయాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబాలకు గౌరవం ఇవ్వకపోతే... బైట కూడా సత్సంబంధాలు కొనసాగించలేరని అని బీజేపీ అగ్రనేతలపై రాహులు ధ్వజమెత్తారు.

మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే


మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజినీర్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సాగు నీటి శాఖపై సచివాలంలో చేసిన సమీక్షలో పలు ప్రశ్నలు సంధించారు. 'పని పూర్తయితే, నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరింది? నీటి పారుదల శాఖ ఎందుకు పొడిగించింది? నిర్మాణ సంస్థ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొత్తం రికార్డులన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలి అని సీఎం స్పష్టం చేశారు. 


నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్డీఎస్‌) ఇచ్చిన మధ్యంతర నివేదిక, వానకాలంలో చేయాలని సూచించిన పనుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. ఈ సమీక్షలో ఉత్తమ్‌తో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖా ఉన్నారు. అయితే ఎన్డీఎస్‌పై సుదీర్ఘ చర్చ చేసినట్టు సమాచారం. బ్యారేజీ కుంగుబాటులో బాధ్యులపై క్రిమినల్‌ చర్యలకు వెనకాడవద్దనీ సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. వచ్చే వారం ప్రాజెక్టు వద్దకు సీఎం వెళ్లనున్నారు. 


Friday, 17 May 2024

మెట్రో రైలు సమయం పొడిగింపు

 


హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నది. 

అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనున్నది. 

ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన సమయాలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. 


Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...