Sunday, 26 May 2024

కోడ్‌ ముగిసిన వెంటనే పోస్టింగులు


- లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

- మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు. 

- కోడ్‌ ముగిసిన వెంటనే వాటినీ ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమైంది. 

- గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టుల ఫలితాలన్నీ వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు మొదలవుతాయి. 

- పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుత నియామక పత్రాలు తీసుకున్న వారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ, ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని సొసైటీలు భావిస్తున్నాయి.

- అందుకే కోడ్‌ ముగిశాక జులై రెండో వారం లోగా ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి.

ముచ్చటగా మూడోసారి కోల్ కతాదే ఐపీఎల్ టైటిల్


ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా విజయభేరీ మోగించింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి హైదరాబాద్ ను  చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలో ఛేదించింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ ను సొంతం చేసుకున్నది. వెంకటేశ్ (52 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో విజృంభించాడు. గుర్బాజ్ (39) ఫోర్లతో విరుచుకుపడ్డాడు.  శ్రేయస్ (6 నాటౌట్‌) బౌండరీతో మెరిశాడు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్, కమిన్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు నాలుగుసార్లు ఫైనల్ చేరిన ఈ రెండు జట్లు తలో రెండుసార్లు టైటిల్ సాధించాయి.  మూడోసారి టైటిల్‌ సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నాయి.ఐపీఎల్ లో కోల్‌కతా, సన్ రైజర్స్‌  మధ్య ఇదే మొదటి ఫైనల్.

Friday, 24 May 2024

'ఒకప్పుడు బీజేపీ ఉండేది'

 జూన్‌ 4వ తేదీ ( ఎన్నికల ఫలితాల రోజు) సంతోషకరమైన రోజు అవుతుంది. 'ఒకప్పుడు బీజేపీ ఉండేది' అనే టైటిల్‌తో ఒక సినిమా విడుదలవుతుంది. మాకు నాయ‌క‌త్వ ముఖాలకు కొరత లేదు. మేము కూర్చుని ముఖాన్ని (ప్ర‌ధాని అభ్య‌ర్థిని) నిర్ణయిస్తాం. మేము ఎంపిక చేసుకోవడానికి ఎంతటి గొప్ప నాయకుల సమూహాన్ని కలిగి ఉన్నామో చూడండి.

-అఖిలేశ్‌ యాదవ్‌, ఎస్పీ అధినేత


అగ్నిపథ్‌తో యువతను మోడీ మోసం చేశారు: రాహుల్‌


సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువతను అగ్నిపథ్‌ పథకం బలవంతపు అమలు ద్వారా ప్రధాని మోడీ మోసం చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక యువతకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సాయుధ బలగాల్లో చేరాలని కోరుకొని, అగ్నపథ్‌ పథకం కారణంగా ఆ అవకాశానికి దూరమైన కొందరు యువకులతో రాహుల్‌గాంధీ ఇటీవల ఓ టెంపో వాహనంలో ప్రయాణిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను రాహుల్‌ సోషల్‌ మీడియా 'ఎక్స్‌' లో పంచుకుని పై వ్యాఖ్యలు చేశారు.

అల్లర్లు సృష్టించడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు పంపిస్తాడా?: మమత


తనను దేవుడే భూమి పైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కౌంటర్‌ వేశారు. 'నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అల్లర్లు సృష్టించడానికి, ప్రచాప ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్సార్సీ ద్వారా ప్రజలను జైలు పాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని' మమతా ధ్వజమెత్తారు.

ఇండియా కూటమితో ఆ వర్గాల రిజర్వేషన్లకు ముప్పు


విపక్ష ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తున్నదని, తద్వారా ముస్లింలసు సంతృత్తి పరచాలని చూస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. యూపీలో కుశినగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటు వేయవద్దు. బీజేపీకి మద్దతుగా నిలువండి. మోడీ మూడోసారి ప్రధాని అయితే భారత్‌ ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. అన్నారు.

ఈసారి మోడీకి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు



ఈసారి మోడీకి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు. ఇవి మన ఎన్నికలు కాదు. కానీ స్వతస్సిద్ధంగా జనం ముందుకు వస్తున్నారు. మోడీని ఓడించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అధిక ధరల వల్ల, నిరుద్యోగం వల్ల, గత 10 సంవత్సరాలలో ఆయన చెప్పినవన్నీ అబద్ధమని తేలిపోవడం వల్ల


- మల్లికార్జున్ ఖర్గే,  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...