Wednesday, 17 December 2025

ముథోల్‌లో పోలింగ్‌ సమయం ముగిసినా.. బారులు తీరిన ఓటర్లు

 ఆదిలాబాద్‌: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా నిర్మల్‌ జిల్లా ముథోల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు క్యూలైన్‌లో బారులు తీరి కనిపించారు. మధ్యాహ్నం ఒంటి గంట లోపు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు సిబ్బంది టోకెన్లు అందజేశారు. దాదాపు 10 వేలకు పైగా ఓటర్లు కలిగిన ఈ పంచాయతీలో సర్పంచ్‌ పదవి కోసం 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 



భారీ సంఖ్యలో ఉన్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం 16 వార్డులకు గాను ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 15 వార్డులకు సరిపడేలా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. మరోవైపు ఈ 15 వార్డుల్లో 50 మంది అభ్యర్థుల వరకు పోటీలో ఉన్నారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లంతా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసే వారందరికీ ప్రవేశం, నిష్క్రమణ ఒకే మార్గం కావడంతో రద్దీ పెరిగింది.




No comments:

Post a Comment

Featured post

బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’..

‘పెద్ది’ ప్రభంజనం ముంగిట తేలిపోయిన డేవిడ్ ధావన్ చిత్రం రెండు రోజుల్లో రూ. 23 కోట్లు మాత్రమే వసూలు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ ద...