Saturday, 13 December 2025

టీజీ: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ షురూ

 



  • 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు
  • 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు 

తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. 193 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. క్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిదశలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పించి ఎన్నికలు నిర్వహిస్తారు. 

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...