Tuesday, 16 December 2025

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ స్పీకర్‌ తీర్పు


మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు




హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ నేడు తీర్పు వెలువరించనున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. శాసనసభ వెబ్ సైట్‌ లో తీర్పు ప్రతులను అధికారులు అప్ లోడ్‌ చేయనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...