Thursday, 18 December 2025

రాసి పెట్టుకోండి రేవంత్‌రెడ్డి.. నా గుండెలో ఉండేది కేసీఆరే..


  • ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్‌





 ‘‘అనేక సార్లు చెప్పా.. మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకోండి రేవంత్‌రెడ్డి.. ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే. నా చేతిలో ఉండేది గులాబీ జెండానే’’ అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. తనపై గురువారం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. ‘‘పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్‌రెడ్డికి అసహనం పరాకాష్ఠకు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాక.. సీఎం ఇష్టానుసారంగా మాట్లాడారు. త్వరలోనే పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగమవుతున్నారు. నాకు, కేటీఆర్‌కు మధ్య మిత్ర భేదం సృష్టించాలని చూస్తున్నారు. తద్వారా బీఆర్‌ఎస్‌ను బలహీనపరచాలని కురచ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. సీఎం చేసే ఇలాంటి కుట్రలు ఫలించవు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా నేనూ, కేటీఆర్‌ మరింత సమన్వయంతో సమర్థంగా..రెట్టించిన ఉత్సాహంతో పోరాడతాం. తెలంగాణకు ద్రోహం చేస్తున్న రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ను గద్దె దించడమే మా లక్ష్యం. బీఆర్‌ఎస్‌ విజయపథంలో పురోగమించి.. మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయం’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...