Monday, 29 December 2025

'సిక్సర్ క్వీన్'గా స్మృతి మంధాన


  •  హర్మన్‌ప్రీత్ రికార్డు బద్ధలు!
  • 10,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకుంది
  • మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌


భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో విరుచుకుపడిన మంధాన, టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత మహిళా క్రికెటర్‌గా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. శ్రీలంకపై జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 48 బంతుల్లో 80 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మూడు సిక్సర్లతో ఆమె ఖాతాలో మొత్తం 80 సిక్సర్లు చేరాయి.





భారత మహిళా క్రికెట్‌లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన టాప్-5 క్రీడాకారిణులు:


  1. స్మృతి మంధాన: 80 సిక్సర్లు (151 ఇన్నింగ్స్‌లు)
  2. హర్మన్‌ప్రీత్ కౌర్: 78 సిక్సర్లు (166 ఇన్నింగ్స్‌లు)
  3. షఫాలీ వర్మ: 69 సిక్సర్లు (93 ఇన్నింగ్స్‌లు)
  4. రిచా ఘోష్: 39 సిక్సర్లు (58 ఇన్నింగ్స్‌లు)
  5. జెమిమా రోడ్రిగ్స్: 22 సిక్సర్లు (102 ఇన్నింగ్స్‌లు)

అదే మ్యాచ్‌లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలిపి) 10,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకుంది. మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.





No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...