Tuesday, 23 December 2025

తమిళులు ఎవరికీ తలవంచరు

 




  • పెరియార్ వారసత్వాన్ని కొనియాడుతూ సీఎం స్టాలిన్  సందేశం


చెన్నై: సామాజిక సంస్కర్త, ద్రావిడ ఉద్యమ పితామహుడు ‘పెరియార్’ ఈ.వీ. రామస్వామి 52వ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తమిళ జాతికి, రాజకీయ ప్రత్యర్థులకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. తమిళులు ఎప్పటికీ, ఎవరికీ తలవంచరని స్టాలిన్ తేల్చి చెప్పారు. పెరియార్ నేర్పిన ఆత్మగౌరవమే (Self-Respect) ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి పునాది అని ఆయన పేర్కొన్నారు. కుల వివక్ష, మహిళా అణచివేతకు వ్యతిరేకంగా పెరియార్ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ.. ఆయన ఆలోచనలు ఆధునిక తమిళనాడు అభివృద్ధికి మార్గదర్శకాలని కొనియాడారు.సామాజిక న్యాయం, సమానత్వం కోసం రాజీలేని పోరాటం చేస్తామని, ద్రావిడ భావజాలాన్ని అణచివేయాలని చూసే శక్తులకు తమిళ గడ్డపై చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళ భాష, సంస్కృతిని కాపాడుకోవడంలో పెరియార్ చూపిన బాటలో నడుస్తామని స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా చెన్నైలోని పెరియార్ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, డీఎంకే  కీలక నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...