- 'వెరీ పూర్' కేటగిరీకి పడిపోయిన గాలి నాణ్యత
- 300 దాటిన ఏక్యూఐ
- తగ్గిన దృశ్యమానత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్ళీ కోరలు చాస్తోంది. శనివారం ఉదయం నగరాన్ని దట్టమైన పొగమంచు (Smog) కమ్మేయడంతో గాలి నాణ్యత 'చాలా ప్రమాదకరంగా' నమోదైంది. శనివారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 300 మార్కును దాటినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వెల్లడించింది.
తగ్గిన దృశ్యమానత
దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ (దృశ్యమానత) గణనీయంగా తగ్గింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ఆనంద్ విహార్, అశోక్ విహార్, ఐటీవో వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు అత్యధికంగా నమోదయ్యాయి. కొన్నిచోట్ల ఏక్యూఐ 350 కి పైగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.గాలి నాణ్యత క్షీణించడంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు,పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.
చలిగాలుల తీవ్రత పెరగడం, గాలుల వేగం తగ్గడం , స్థానిక కాలుష్య కారకాలు తోడవడంతో కాలుష్య మేఘాలు నగరంపైనే పేరుకుపోయి ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.ప్రభుత్వం ఇప్పటికే GRAP (Graded Response Action Plan) నిబంధనలను అమలు చేస్తున్నప్పటికీ, కాలుష్య తీవ్రత తగ్గకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
No comments:
Post a Comment