- సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన త్వరలోనే వీడుతుంది
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఫడ్నవీస్
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం) మధ్య నెలకొన్న సీట్ల సర్దుబాటు ప్రతిష్టంభన త్వరలోనే పరిష్కారమవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు.
సానుకూల చర్చలు
ఇప్పటికే మెజారిటీ స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన కొన్నిస్థానాల విషయంలో ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. "మేము ఐక్యంగా ఉన్నాం, మా లక్ష్యం ఒక్కటే.. అది ముంబై అభివృద్ధి" అని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాయుతి కూటమి సాధించిన ఘనవిజయం బీఎంసీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారని గత ఫలితాలు నిరూపించాయని గుర్తు చేశారు.
ప్రతిపక్షాలకు కౌంటర్
ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు ఏకమవ్వడంపై స్పందిస్తూ.. ఎన్ని శక్తులు ఏకమైనా మహాయుతి ప్రభంజనాన్ని ఆపలేరని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. తాము కేవలం నెగటివ్ పాలిటిక్స్ కాకుండా, చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతామని చెప్పారు. ముంబైని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన అజెండా అని, కాలుష్య నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన వివరించారు.జనవరి 15న జరగనున్న బీఎంసీ ఎన్నికల కోసం మరికొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment