Tuesday, 16 December 2025

తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

3,752 సర్పంచి పదవులకు పోలింగ్‌




తెలంగాణలో మూడో దశ (చివరి దశ) పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు, 140 మంది ఇతరులతో కలిపి మొత్తం 53,06,395 మంది 36,452 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.



మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా.. అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు.  394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది పోటీ చేస్తున్నారు. 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా 116కి నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28,410 వార్డులకు 75,725 మంది బరిలో ఉన్నారు





No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...