Saturday, 20 December 2025

నీతీశ్‌ కుమార్ తీరుపై మాయావతి అసహనం

 

  •  'క్షమాపణలు చెప్పాలి' అంటూ సలహా!

లక్నో: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ ఒక మహిళా వైద్యురాలి హిజాబ్‌ను (ముసుగు) తొలగించడానికి ప్రయత్నించిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన "చాలా విచారకరం, దురదృష్టకరం"గా ఆమె అభివర్ణించారు.



మాయావతి తన 'ఎక్స్‌'  ఖాతాలో స్పందిస్తూ.. డాక్టర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో మహిళల భద్రత, గౌరవానికి సంబంధించిన అంశాలపై సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి, కొందరు మంత్రుల వ్యాఖ్యల వల్ల ఇది మరింత వివాదాస్పదమైందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ననీతీశ్‌ కుమార్ ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి, వివాదానికి తెరదించాలని ఆమె సూచించారు.  కొన్ని రోజులుగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల నాయకులు నీతీశ్‌ కుమార్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు నేడే పోలింగ్

ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్ను...