Tuesday, 9 December 2025

కారును ఢీకొన్న విమానం

  • ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఘటన
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నించిన విమానం
  • వేగం అదుపు చేయలేక కారు ఢీ
  • ముగ్గురు సురక్షితం


అమెరికా ఫ్లోరిడాలో  ప్రమాదం చోటుచేసుకున్నది. రోడ్డుపై దూసుకెళ్తున్న కారును ఓ చిన్న విమానం వెనక నుంచి ఢీకొంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్‌ కౌంటీ సమీపంలోని ఇంటర్‌స్టేట్‌–95 జాతీయ రహదారి మీద ఆ విమానం హఠాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అయితే వేగాన్ని నియంత్రించలేక ముందుకు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాద సమయంలో విమానంలో పైలట్‌, ఒక ప్రయాణికుడు ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ఇద్దరూ సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. విమానం అత్యవసర ల్యాండింగ్‌కు కారణాలేమిటన్న విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...