క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రధాని మోడీ పోస్టు
- క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రధానిపై నరేంద్ర మోడీ బుధవారం తన లింక్డ్‌ఇన్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. మరిచిపోయిన లేదా క్లెయిమ్ చేయని నగదును తిరిగి పొందడానికి ఇది మంచి అవకాశం అని తెలిపారు. “మీ డబ్బు… మీ హక్కు” అని స్పష్టం చేశారు.
- దేశవ్యాప్తంగా భారతీయ బ్యాంకుల్లో సుమారు ₹78 వేల కోట్లు, ఇన్సూరెన్స్ సంస్థల్లో ₹14 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ₹3 వేల కోట్లు, అలాగే డివిడెండుల రూపంలో ₹9 వేల కోట్లు ఇప్పటికీ క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఈ మరిచిపోయిన ఆస్తులను ఎలా కనుగొనాలో తెలుసుకునేందుకు సంబంధించిన వెబ్‌సైట్లను కూడా ఆయన పంచుకున్నారు.
No comments:
Post a Comment