Saturday, 20 December 2025

క్షేమంగానే ఉన్నా.. ప్రమాదంపై స్పందించిన నోరా ఫతేహి

 



బాలీవుడ్ నటి, డాన్సర్ నోరా ఫతేహి శనివారం మధ్యాహ్నం ముంబైలో జరిగిన ఒక భయంకరమైన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సన్ బర్న్ ఫెస్టివల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఈ ప్రమాదంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి నడుపుతున్న కారు తన కారును బలంగా ఢీకొట్టిందని ఆమె తెలిపారు. ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, తాను కారులో ఒక వైపు నుంచి మరో వైపుకు విసిరివేయబడ్డానని, తన తల కిటికీకి బలంగా తగిలిందని నోరా పేర్కొన్నారు. "నా కళ్లముందే నా జీవితం మెదిలింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలు, తలకి చిన్న దెబ్బతో బయటపడ్డాను. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. మీ నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులకు భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...