- హాజరైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ' (CWC) సమావేశం శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'లో ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, శశి థరూర్ తదితర సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశం ముఖ్యాంశాలు
కఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం MGNREGA (ఉపాధి హామీ పథకం) పేరు మార్చడం మరియు నిధుల వాటాను మార్చడంపై రాష్ట్రాల నిరసనను చర్చించనున్నారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు కూడా అధిష్టానం దృష్టికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డీకే శివకుమార్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
2026 వరకు దేశవ్యాప్తంగా చేపట్టబోయే 'సంగఠన్ సృజన్' (సంస్థాగత పునర్నిర్మాణ) కార్యక్రమం మరియు రాజకీయ ప్రచారాలపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు.
No comments:
Post a Comment