Wednesday, 17 December 2025

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తోసిపుచ్చిన స్పీకర్‌





హైదరాబాద్‌: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.


మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన సభాపతి.. ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్‌ కుమార్‌కు సంబంధించి గరువారం తీర్పు వెలువడనుంది. 








No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...