Monday, 29 December 2025

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత


షేక్ హసీనా  సంతాపం!

  • ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం
  • 2015 నాటి ఢాకా పర్యటనను గుర్తుచేసుకుంటూ నివాళులు!

బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక ధ్రువతార కన్నుమూసింది. ఆ దేశ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా (80) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు.ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.



షేక్ హసీనా సంతాపం

ఖలీదా జియా మరణంపై ఆమె సుదీర్ఘ రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రవాసంలో ఉన్న హసీనా, తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: "బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం ఖలీదా జియా చేసిన పోరాటం మరువలేనిది. ఆమె మరణం బంగ్లాదేశ్ రాజకీయరంగానికి , బీఎన్‌పీ నాయకత్వానికి తీరని లోటు." ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు హసీనా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


రాజకీయ ప్రస్థానం


ఖలీదా జియా బంగ్లాదేశ్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా 1991లో బాధ్యతలు చేపట్టారు.

ఆమె మొత్తం మూడు సార్లు (1991-96, 1996 ఫిబ్రవరి, 2001-06) ప్రధానమంత్రిగా పనిచేశారు.

తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ హత్య తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి పార్టీని విజయపథంలో నడిపించారు.

ఆమె మృతికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు సంతాపం తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించింది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...