Tuesday, 16 December 2025

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, బీజేపీపై అభిషేక్ సింఘ్వీ విమర్శలు



నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.



ఈ కేసులో అసలైన నేరం  లేదని కోర్టు తేల్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "గాలిలో అనేక ఆరోపణలు చక్కర్లు కొట్టాయి, కానీ చట్టం మాత్రం భూమిపై దృఢంగా నిలబడింది" అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ కేసును వాడుకుందని, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ విచారణలు సాగాయని ఆయన విమర్శించారు. చివరకు న్యాయమే గెలిచిందని, రాజకీయ ప్రేరేపిత కేసులకు కాలం చెల్లిందని సింఘ్వీ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...