Wednesday, 17 December 2025

ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: పృథ్వీరాజ్ చవాన్




ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విషయంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ వెనక్కి తగ్గలేదు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన బుధవారం స్పష్టం చేశారు.


పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ తొలిరోజే భారత్ ఓడిపోయిందని, భారత విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. భారత సైన్యం ధైర్యసాహసాలను అవమానించినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.దీనిపై స్పందించిన చవాన్, "నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆ ప్రశ్నే లేదు. రాజ్యాంగం నాకు ప్రశ్నలు అడిగే హక్కును కల్పించింది" అని గట్టిగా సమాధానమిచ్చారు. యుద్ధ తంత్రం మారుతున్న తరుణంలో, భారీ సైన్యం కంటే అత్యాధునిక సాంకేతికతపై దృష్టి పెట్టాలని తాను ఉద్దేశించానని, తన మాటలలో తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...