Thursday, 25 December 2025

ఢిల్లీ కాలుష్యం.. వారు పరిష్కరించగలరని నమ్ముతున్నా

  •  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్


ఢిల్లీలో రోజురోజుకు తీవ్రమవుతోన్న వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్  ఆందోళన వ్యక్తం చేశారు. దేశరాజధానిని పీడిస్తున్న ఈ సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ప్రయోజనాలు కలిగించే విధానాల కంటే.. దీర్ఘకాల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జస్టిస్‌ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. శుక్రవారం ఉదయం హానికర పొగమంచు ఢిల్లీలోని అనేక ప్రాంతాలను కమ్మేసింది. ఫలితంగా దృశ్య నాణ్యత బాగా పడిపోయింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్  స్టేజ్-4 కింద ఆంక్షల అమలును కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ  310గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏక్యూఐ స్థాయులు 395గా నమోదైనట్లు తెలిపింది.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...