- మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
- రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి, రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావ్, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావ్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే ఇస్తామని హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని యువత అడుగుతోందని జాగృతి అధ్యక్షురాలు ఎక్స్ వేదికగా నిలదీశారు. ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్‌తో ఇన్నాళ్లు మభ్యపెట్టి ఇప్పుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడుతున్నావ్; అది పోరాటాల పురిటిగడ్డ అని గుర్తుచేస్తూ, మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం చేశావో చెప్పగలవా అని ప్రశ్నించారు. ఉత్తుత్తి మాటలు, జాబ్‌లెస్ క్యాలెండర్‌ల కాలం చెల్లిందని, రైజింగ్ పేరుతో అబద్ధాల వల్లెవేత కాదు, యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డపైనే స్పష్టత ఇవ్వాలంటూ ఆమె డిమాండు చేశారు.
No comments:
Post a Comment