Monday, 22 December 2025

అరావళి మైనింగ్‌పై కేంద్ర మంత్రి వివరణను తప్పుబట్టిన జైరాం రమేష్

 

అరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇచ్చిన స్పష్టతపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మరిన్ని ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల అరావళి ప్రాంతంలో కేవలం 0.19 శాతం (అంటే 277 చ.కి.మీ) మాత్రమే మైనింగ్‌కు అనుమతిస్తామని మంత్రి పేర్కొనగా, ఆ 0.19 శాతం భూమి కూడా దాదాపు 68,000 ఎకరాలకు సమానమని, ఇది చాలా పెద్ద విస్తీర్ణం అని జైరాం రమేష్ విమర్శించారు.




మంత్రి చెబుతున్న లెక్కలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అరావళి విస్తరించి ఉన్న జిల్లాల మొత్తం భూభాగాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ శాతం లెక్కించారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి అరావళి పర్వత ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ మైనింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొండల ఎత్తును మార్చడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేసేలా కొత్త నిర్వచనాలు ఇస్తున్నారని, దీనివల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిస్కా టైగర్ రిజర్వ్ సరిహద్దులను మార్చడం వల్ల పర్యావరణ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని జైరాం రమేష్ హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...