Monday, 15 December 2025

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై బస్సుల్లో మంటలు.. నలుగురి మృతి

 




యమునా ఎక్స్‌ప్రెస్ వే (ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారి)పై ఉత్తరప్రదేశ్‌లోని మధుర సమీపంలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొత్తం ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...