Tuesday, 16 December 2025

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఘోర ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య


  •  రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం యోగి

మధుర (ఉత్తరప్రదేశ్): యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. దట్టమైన పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో సుమారు 11 వాహనాలు (8 బస్సులు, 3 కార్లు) ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తర్వాత వాహనాల్లో మంటలు చెలరేగడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారింది.



ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


ప్రమాద వివరాలు

 మధురలోని బలదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్‌స్టోన్ 127 వద్ద ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో వరుసగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మంటల్లో చిక్కుకున్న వారు ప్రాణభయంతో కేకలు వేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...మరణించిన వారిలో కొందరిని ప్రయాగ్‌రాజ్, గోండా. ఆజంగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...