Monday, 6 April 2026

బంగ్లా సరిహద్దులో 'సరీసృపాల' పహారా?


చొరబాట్లకు చెక్ పెట్టేందుకు బీఎస్‌ఎఫ్ సరికొత్త ప్లాన్!

న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తోంది. సరిహద్దు వెంబడి ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లోకి మొసళ్లు, విష సర్పాలను వదలాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.



  • ఎందుకీ వినూత్న ఆలోచన?

బంగ్లాదేశ్‌తో ఉన్న తూర్పు సరిహద్దు ప్రాంతం భౌగోళికంగా చాలా సంక్లిష్టమైనది. ఇక్కడ ఫెన్సింగ్ (కంచె) వేయడంలో ఎదురవుతున్న సవాళ్లే ఈ ఆలోచనకు పునాది అని తెలుస్తోంది.  ఈ ప్రాంతం తరచూ వరదలకు గురవుతుంటుంది. దీనివల్ల శాశ్వత కంచె నిర్మించడం, నిర్వహించడం కష్టతరంగా మారింది.  నదీ మార్గాల ద్వారా స్మగ్లర్లు, చొరబాటుదారులు సులువుగా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. భౌతిక కంచె సాధ్యం కాని చోట, ప్రకృతి సిద్ధమైన 'జీవ రక్షణ' (Biological Defense) కల్పించాలన్నది అధికారుల ఆలోచన.


  • అమలులో ఉన్న సవాళ్లు

ఈ ప్రతిపాదనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, దీని అమలు అంత సులువు కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మూడు సవాళ్లు ఉన్నాయి. ఒకటి భారీ సంఖ్యలో మొసళ్లు, పాములను సేకరించి, వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో ఉంచడం క్లిష్టమైన ప్రక్రియ. రెండు సరిహద్దుకు ఇరువైపులా జనసాంద్రత అధికంగా ఉంటుంది. ఈ సరీసృపాలు స్థానిక ప్రజలపై దాడి చేసే ప్రమాదం ఉంది. మూడు వరదలు వచ్చినప్పుడు ఈ మొసళ్లు, పాములు జనావాసాల్లోకి కొట్టుకొచ్చే అవకాశం ఉండటంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఆలోచన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. నదీతీర ప్రాంత ప్రజలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా? అనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉన్నదని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

కాంగ్రెస్‌ ఎప్పటినుంచో పాక్‌ పాట పాడుతోంది

ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు అసోం: కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ ఎప్పటి నుంచో పాకిస్...