Sunday, 3 May 2026

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ దూరమే

 


  • శాంపిల్ సైజ్ ,రాజకీయ వాతావరణంపై మనోజ్ ఝా కీలక ప్రశ్నలు

ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అంచనాలపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటి విశ్వసనీయతను ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో ఓటర్లు తమ మనసులోని మాటను బహిరంగంగా చెబుతారనుకోవడం భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హింస , భయం నీడన సాగే ఎన్నికల ప్రక్రియలో, సర్వే సంస్థల ప్రతినిధులతో ఓటర్లు ఎంతవరకు నిజాయితీగా సంభాషిస్తారనేది పెద్ద ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.కేవలం కొన్ని వేల మందితో సేకరించే శాంపిల్ సైజ్ లక్షల సంఖ్యలో ఉన్న ఓటర్ల నాడిని ఎలా పట్టుకోగలదని ఆయన విమర్శించారు. గతంలో పశ్చిమ బెంగాల్ ,ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన ఉదాహరణలను ఆయన గుర్తు చేశారు. గణాంక శాస్త్రం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విశ్లేషించే వారు, క్షేత్రస్థాయిలో ఉన్న భయాందోళనలను , ఓటర్ల గోప్యతను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజల అసలైన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందని, తుది ఫలితాలు వచ్చే వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రామాణికంగా తీసుకోలేమని మనోజ్ ఝా స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ ట్రోల్స్‌కు ఆస్కార్ విజేత అదిరిపోయే కౌంటర్!

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌.. రెహమాన్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు! ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన తాజా పీరియడ్ లవ్ స్ట...