- రిపబ్లికన్లతో కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: వెనిజులాపై అమెరికా జరిపిన సైనిక దాడులు, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన పరిణామాల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 'మిడ్-టర్మ్' (మధ్యంతర) ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే, తనపై మళ్లీ 'అభిశంసన' ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని ఆయన స్వయంగా రిపబ్లికన్ పార్టీ నేతలకు వెల్లడించారు.
మధ్యంతర ఎన్నికల టెన్షన్
2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచి, ప్రతినిధుల సభను చేజిక్కించుకుంటే, వారు తనను గద్దె దించేందుకు ప్రయత్నిస్తారని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. "మనం గెలవకపోతే, వారు నన్ను అభిశంసిస్తారు" అని ఆయన రిపబ్లికన్లతో అన్నట్లు సమాచారం. వెనిజులాలో మదురోను బంధించడంపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న తరుణంలో, ఈ ప్రభావం స్వదేశంలో ఎన్నికలపై పడకుండా చూసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే తన మద్దతుదారులు, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డెమోక్రాట్లు కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తారని, దేశ భద్రత కంటే తనను పదవి నుంచి తొలగించడమే వారి ప్రధాన లక్ష్యమని ట్రంప్ ఆరోపించారు. తన అధ్యక్ష పదవికి ఎటువంటి ముప్పు రాకుండా ఉండాలంటే, మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించడం అత్యంత కీలకమని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
No comments:
Post a Comment