Wednesday, 6 May 2026

'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు తాత్కాలిక విరామం!


  • ఇరాన్‌తో శాంతి చర్చల వేళ ట్రంప్ కీలక నిర్ణయం



అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యవహారంలో  వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, దౌత్య ప్రయత్నాలకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వంటి మధ్యవర్తిత్వ దేశాల విజ్ఞప్తి మేరకు, అలాగే ఇరాన్‌పై సైనికపరంగా పైచేయి సాధించిన తరుణంలో ఈ ముందడుగు వేసినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఈ విరామం కేవలం నౌకల రాకపోకల మార్గదర్శకత్వానికి మాత్రమే పరిమితమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ రేవులపై విధించిన కఠినమైన 'నౌకాదళ దిగ్బంధం' (Naval Blockade) మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు ఆర్థిక , సైనిక ఒత్తిడిని తగ్గించే ప్రసక్తే లేదని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఒకవైపు శాంతి చర్చలు సాగుతున్నా, మరోవైపు దిగ్బంధం కొనసాగిస్తూ ఇరాన్‌ను లొంగివచ్చేలా చేయడమే అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ద్వారా తమ లక్ష్యాలను సాధించామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించగా, ఇప్పుడు బంతి ఇరాన్ కోర్టులో ఉంది.

No comments:

Post a Comment

Featured post

ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్

 జోధ్‌పూర్‌లో దారుణం ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్ న్యాయం జరక్క ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య రాజస్థాన్‌లో రగిలిపోతున్న నిరసన జ్వా...