- పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: అశోక్ గెహ్లాట్
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తోసిపుచ్చారు. తనకు అలాంటి సంకేతాలేవీ రాలేదని, ఈ విషయంపై పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ కూడా జరగలేదని స్పష్టం చేశారు.
గత 50 ఏళ్లుగా సమావేశాలు, ఇతర పార్టీ కార్యక్రమాల కోసం ఢిల్లీకి వెళ్తూనే ఉన్నానని గెహ్లాట్ తెలిపారు. ప్రస్తుతం తాను రాజస్థాన్‌లోనే సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, పలు కీలక పదవులు నిర్వహించానని, తన రాజకీయ జీవితంపై సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. అయితే, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తనను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని అధిష్ఠానం భావిస్తే అందుకు వెనుకాడబోనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. పార్టీకి ఏది మంచిది, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలను పరిశీలించి కాంగ్రెస్ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

No comments:
Post a Comment