- పాకిస్థాన్ మంత్రి భారత పర్యటనపై సుప్రియా శ్రీనేత్ తీవ్ర విమర్శలు
తొలిసారి నిర్వహిస్తున్న SCO సివిలైజేషన్ డైలాగ్‌కు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరుభారత్‌కు వ్యతిరేకంగా విషం చిమ్మిన వ్యక్తికి విందులిస్తారా అంటూ ప్రధానిపై ప్రశ్నల వర్షంన్యూఢిల్లీ:షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో భారత్ తొలిసారిగా నిర్వహిస్తున్న 'SCO సివిలైజేషన్ డైలాగ్' (SCO Civilization Dialogue) సదస్సుకు పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి డాక్టర్ ముసాదిక్ మాలిక్ హాజరుకావడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ (Supriya Shrinate) కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గతంలో భారత్‌ను ఉద్దేశించి చేతులు నరుకుతామని, రక్తపాతం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేసిన పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్‌ను మోదీ ప్రభుత్వం భారత్‌కు ఆహ్వానించిందని ఆమె ఆరోపించారు. భారత్‌ను ద్వేషించే వ్యక్తికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం బిర్యానీలు, ఖీర్ వడ్డించి ఆతిథ్యం ఇవ్వబోతోందని తీవ్రంగా విమర్శించారు. భారత వ్యతిరేక పాకిస్థాన్ లేకుండా మీ పని జరగదా అని ప్రధానిని ప్రశ్నించారు.ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని రాహుల్ గాంధీ చెప్పిన మాటలనే నరేంద్ర మోదీ కూడా పాటించాలని సుప్రియా శ్రీనేత్ హితవు పలికారు.
పహల్గామ్‌లో జరిగిన నరమేధం తర్వాత కూడా ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు స్వాగతం పలకడంలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఇది బహుళపక్ష వేదిక (Multilateral Forum) అని సమర్థించుకునే ప్రయత్నాలు చేయవద్దని, 2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన సార్క్ (SAARC) సదస్సుకు భారత్ వెళ్లలేదని గుర్తు చేశారు. అలాగే, 2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్‌ను పిలిచిన మోదీ, 2019లో ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.మరి ఈసారి పాకిస్థాన్‌ను ఆహ్వానించాల్సిన అంత పెద్ద నిర్బంధం ఏమిటి? మీపై ఏవైనా విదేశీ శక్తుల ఒత్తిడి ఉందా? అంటూ సుప్రియా శ్రీనేత్ ప్రధానిని నిలదీశారు. "మోదీ జీ, మీ రక్తం మరగడం లేదా? మీ నరాల్లో ప్రవహిస్తోంది రక్తమా లేక నీళ్లా?" అంటూ ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, SCO నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానం పంపామని, దీనిని ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పుగా చూడకూడదని భారత విదేశాంగ శాఖ (MEA) స్పష్టం చేసింది.

No comments:
Post a Comment