- కాంగ్రెస్ ఆరోపణలు.. బీజేపీ ఖండన
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు తుది పదకొండు మందిలో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది. సిరాజ్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ, ఆయన ముస్లిం కావడం వల్లే జట్టులోకి ఎంపిక చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ టెస్టు జట్టులో చోటు కల్పించలేదని అన్నారు. ‘‘సిరాజ్ అనే పేరు ఉండటం వల్లే ఆయనకు జట్టులో స్థానం దక్కలేదని చెబుతున్నారు. మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఎంపిక చేయకపోతే వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, మతం ఆధారంగా వివక్ష చూపారన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. జట్టులో అవకాశాలు మతం ఆధారంగా కాకుండా ప్రతిభ, మెరిట్ ప్రాతిపదికన కల్పిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన రిజిజు.. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు.

No comments:
Post a Comment