- మెజారిటీ మార్కును దాటిన కమలం
- మమతా బెనర్జీ వెనుకంజ!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, 294 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 148 సీట్ల మెజారిటీ మార్కును బీజేపీ దాటినట్లు తెలుస్తోంది. అటు తృణమూల్ కాంగ్రెస్ (TMC) కూడా గట్టి పోటీనిస్తూ బీజేపీకి చేరువలోనే ఉంది. అయితే, అత్యంత కీలకమైన భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉండటం రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. నందిగ్రామ్‌లో కూడా సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు, గత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి మాల్ , మొతాబరి వంటి నియోజకవర్గాల్లో ముందంజలో ఉండటం గమనార్హం. దక్షిణ బెంగాల్‌లోని మొత్తం 108 స్థానాల్లో టీఎంసీ 22 చోట్ల, బీజేపీ 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 92.47 శాతం పోలింగ్ నమోదు కావడంతో, ఈ భారీ ఓటింగ్ ఎవరికి పట్టం కడుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుండి దాదాపు 90 లక్షల పేర్ల తొలగింపు (SIR) ప్రక్రియ కూడా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాయంత్రం కల్లా బెంగాల్ పీఠంపై స్పష్టమైన చిత్రం రానుంది.
No comments:
Post a Comment